Header Banner

దారుణం.. కాలేజ్ బాత్​రూమ్​లో ప్రసవం - బిడ్డను డస్ట్​బిన్​లో పడేసిన విద్యార్థిని! చివరకు ఏమైందంటే?

  Sun Feb 02, 2025 20:14        India

కాలేజీ టాయిలెట్‌లో ప్రసవించిన ఓ విద్యార్థిని.. యూట్యూబ్‌లో చూసి శిశువు బొడ్డుకోసి చెత్త కుప్పలో పడేసింది. తమిళనాడులోని తంజావూర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కుంభకోణంలోని ప్రభుత్వ మహిళా కాలేజీలో 4 వేలమందికిపైగా అమ్మాయిలు చదువుకుంటున్నారు. వారిలో ఓ విద్యార్థిని (20) గర్భం దాల్చింది. అయితే, ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. శుక్రవారం క్లాసు వింటుండగానే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో టాయిలెట్‌కు వెళ్లిన ఆమె అక్కడే శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం యూట్యూబ్‌లో చూసి శిశువు బొడ్డు కోసింది. అనంతరం చెత్తకుప్పలో శిశువును పడేసి పైన చెత్త కప్పేసింది. తర్వాత ఏమీ ఎరగనట్టు తరగతి గదిలోకి వెళ్లి కూర్చుంది. అయితే, ఆమె నుంచి రక్త్రస్రావం అవుతుండటాన్ని గుర్తించిన తోటి అమ్మాయిలు విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లడంతో వారు 108 అంబులెన్స్‌ను పిలిపించి ఆసుపత్రికి తరలించారు. అక్కడ  పరిక్షించిన వైద్యులు ఆమె ప్రసవించినట్టు గుర్తించి బిడ్డ గురించి ఆరా తీశారు. అంబులెన్స్‌ను పంపి కళాశాల చెత్తకుప్పలో పడివున్న శిశువును ఆసుపత్రికి తీసుకొచ్చారు. వెంటనే చికిత్స అందించడంతో శిశువు బతికింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

ఇంకా చదవండి: జగన్ షాక్: సంచలనంగా మారిన షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ.. రాజకీయాలపై మూడు గంటలపాటు చర్చ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఫామ్ హౌస్‌లో భారీ పార్టీ... ఇద్దరూ ప్రమాదకరం.. బాబు పంచ్‌ మామూలుగా లేదుగా!

 

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్! PMDDKY పథకం ఎలా ఉపయోగపడుతుందంటే?

 

మటన్ ప్రియులకు షాకింగ్ అలర్ట్! తిన్న వెంటనే ఇవి తింటే ఏం జరుగుతుందో తెలుసా?

 

బ‌డ్జెట్‌-2025.. మధ్యతరగతికి భారీ ఊరట.. బడ్జెట్ తో ధరలు దగ్గేవి, పెరిగేవి ఇవే!

 

ఆదాయ పన్నుపై కేంద్రం గుడ్ న్యూస్! కొత్త పన్ను విధానంలో.. సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట..

 

మ‌హిళల‌కు గుడ్‌న్యూస్.. ఈ ప‌థ‌కం కింద వ‌చ్చే ఐదేళ్ల‌లో రూ. 2కోట్ల వ‌ర‌కు రుణాలు!

 

రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి! 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు..

 

అమెరికాలో మరో ప్రమాదం.. విమానం కూలడంతో సమీపంలోని ఇళ్లు, కార్లు దగ్ధం!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్‌ పోస్టులపై చర్చ!

 

టీడీపీ కార్యాలయంలో కోపగించుకున్న లోకేష్! ప్రోటోకాల్ పేరుతో పోలీసుల అత్యుత్సాహం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #TamilNadu #CollegeGirl #Kumbakonam #Thanjavur